తెలుగు సినీ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని కథానాయిక సమంత. ఈ మధ్య సమంత ఏం చేసినా ఒక సంచలనం అయిపోతుంది. ఆఖరికి ఆమె మాట్లాడిన మాటలు కూడా నెట్టింట వైరల్ అయిపోతున్నాయి.
ఇప్పటికే తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన సామ్.. ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ అయ్యింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది సామ్.
ఓవైపు వరుస ప్రాజెక్టులతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న సామ్.. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. ప్రస్తుతం దక్షిణాది చిత్రపరిశ్రమలో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న సామ్ ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంది.
తన జీవితంలో అనేక పోరాటాలు చేసి కథానాయికగా ప్రయాణం సాగించిన తీరు అంత తేలికేమి కాదు. హీరోయిన్ కాకముందు సామ్ ఏ ఉద్యోగం చేసింది.. తన మొదటి జీతం ఎంతో తెలిస్తే మీరు షాకవుతారు.
గతంలో ఓ ఇంటర్వ్యూలో సామ్ మాట్లాడుతూ.. తాను స్కూల్ లో ఉన్నప్పుడు ఓ కాన్ఫరెన్స్ కోసం హోటల్లో హోస్టెస్‍గా పనిచేసినట్లు చెప్పింది.
దాదాపు ఎనిమిది గంటలు షిఫ్ట్ లో పనిచేశానని.. అందుకు ఆమెకు రూ. 500 చెల్లించారని వెల్లడించింది. సమంత మొదటి ఉద్యోగం చేసినప్పుడు ఆమె 10వ తరగతి చదువుతుంది. ఏమాయ చేసావే సినిమా తెలుగు తెరకు పరిచయమైన సామ్.. ఇప్పుడు అత్యంత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. అంతేకాదు.. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి సైతం ఎంట్రీ ఇస్తుంది.