కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న టాలీవుడ్ అందాల భామ సమంత…ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. చాలా రోజుల తరువాత ఇటీవలే శాకుంతలం ట్రైలర్ లాంచ్ వేడుకలో పాల్గొంది. దాని తరువాత సామ్ గురించి నెట్టింట్లో చర్చ మొదలైంది. సామ్ అందం పూర్తిగా తగ్గిపోయిందని మునుపటిలా లేదంటూ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.
అయితే సామ్ ను ట్రోల్ చేసిన వారందరికీ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. తాజాగా మయోసైటిస్ నుంచి కోలుకుంటూ తిరిగి తన వర్కవుట్స్ పై దృష్టి పెట్టింది. ఎప్పుడు ఇంట్రెస్టింగ్ కోట్స్, మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఇక బలంగా ఉండేందుకు జిమ్ లో కుస్తీలు పడుతున్న ఓ వీడియోను సామ్ షేర్ చేసింది.
లావుగా ఉన్న మహిళ ఇది చేసే వరకు ముగియదు. ముఖ్యంగా @whoisgravity స్పెషల్ థాంక్స్. మీరు నాకు కొన్ని కఠినమైన రోజులలో స్పూర్తిని ఇచ్చారు. బలం అంటే మనం తీసుకునే ఆహారం ఇమ్యూనిటీ ఫుడ్ కాదు.. మనం ఎలా ఆలోచిస్తామో అదే మన బలం.” అంటూ రాసుకొస్తూ.. వర్కవుట్స్ చేస్తున్న వీడియో షేర్ చేసింది.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక సమంత నటించిన శాకుంతలం సినిమా ఫిబ్రవరి 17న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అలాగే త్వరలోనే సామ్.. డైరెక్టర్ శివ నిర్వాణ, విజయ్ దేవరకొండ కాంబోలో రాబోతున్న ఖుషి చిత్రం షూటింగ్ లో పాల్గొననుంది. అలాగే బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటిస్తోన్న సైన్స్ ఫిక్షన్ సిటాడెల్ చిత్రీకరణలో జాయిన్ కానుంది.