హీరోయిన్ సంధ్య గుర్తుందా..? ప్రేమిస్తే సినిమాలో హీరోయిన్ ఈమె. ఆ తర్వాత పవన్ కల్యాణ్ హీరోగా నటించిన అన్నవరం సినిమాలో అతడికి చెల్లెలిగా కూడా నటించింది. అలా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అదే టైమ్ లో తమిళ్, కన్నడ ఇండస్ట్రీల్లో కూడా పేరు తెచ్చుకుంది. ఇప్పుడీ హీరోయిన్ ఉన్నఫలంగా వార్తల్లోకెక్కింది.
సినిమాల నుంచి తప్పుకొని, ఫ్యామిలీ లైఫ్ లో సెటిలైంది సంధ్య. ఆమెకు కొన్ని కుటుంబ వ్యాపారాలు కూడా ఉన్నాయి. అందులో రిసార్ట్ బిజినెస్ కూడా ఒకటి. చెన్నై సముద్ర తీరంలో ఉన్న కాస్ట్ లీ రిసార్టుల్లో ఒకటి సంధ్యది. ఇప్పుడా రిసార్ట్ ఆమెకు అపఖ్యాతి తెచ్చిపెట్టింది.
సంధ్యకు పెరల్ బీచ్ అనే రిసార్ట్ ఉంది. అందులో గడిపేందుకు తన స్నేహితురాలితో కలిసి వచ్చాడు రామచంద్రన్ అనే వ్యక్తి . ఇద్దరూ కలిసి మద్యం సేవించి ఎంజాయ్ చేశారు. తర్వాత వేర్వేరు గదుల్లో పడుకున్నారు. రిసార్ట్ లో పనిచేస్తున్న సుభాష్ అనే వ్యక్తి.. మారుతాళంతో రామచంద్రన్ స్నేహితురాలి గదిలోకి ఎంటరయ్యాడు.
మద్యం సేవించి నిద్రలోకి జారుకున్న ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తనపై జరుగుతున్న లైంగిక దాడిని గుర్తించిన ఆ యువతి వెంటనే కేకలు వేసింది. దీంతో రామచంద్రన్ తో పాటు చుట్టపక్కల వ్యక్తులు అలెర్ట్ అయ్యారు. సుభాష్ ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ బయటపడింది. సుభాష్ కు ఇలాంటివి కొత్త కాదంట. అదే రిసార్ట్ లో దాదాపు 50మంది మహిళల్ని తన సెల్ ఫోన్ లో నగ్నంగా చిత్రీకరించాడట. దీంతో పోలీసులు షాక్ అయ్యారు. అటు సంధ్య ఇమేజ్ కూడా దెబ్బతింది. ఇంత జరిగిన తర్వాత ఆమె రిసార్ట్ కు ఎవరొస్తారు?