కన్నడ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసులో అరెస్టైన నటి సంజనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమె ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బెయిల్ ఇస్తూ కర్ణాటక హైకోర్టు నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 8న ఆమె అరెస్ట్ కాగా, అంతకు ముందే అరెస్టైన మరో నటి రాగినికి మాత్రం కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు.
తనకు అత్యవసరంగా పరీక్ష చేయించుకోవాల్సి ఉందని సంజన కోర్టుకు తెలపగా… కోర్టు ప్రభుత్వ వైద్యుల నివేదిక కోరింది. ప్రభుత్వ డాక్టర్లు కూడా ఆపరేషన్ అవసరమే అని నిర్ధారించటంతో కోర్టు మెడికల్ గ్రౌండ్స్ కింద బెయిల్ మంజూరు చేసింది.
డ్రగ్స్ కేసులో సెంట్రల్ క్రైం బ్రాంచ్ మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేసింది. మొత్తం 12మందిపై అభియోగాలు మోపింది.