డ్రగ్స్ ఇష్యూ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ఇప్పటికే హీరోయిన్స్ రాగిణితో పాటు బుజ్జిగాడు ఫేం సంజనను సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. సంజనకు డ్రగ్స్ డీలర్స్ తో లింకులున్నట్లు పోలీసులు బలంగా నమ్ముతున్నారు. దీంతో ఆమె డ్రగ్స్ తీసుకుందా లేదా అన్న కోణాన్ని నిర్ధారించుకునేందుకు డోప్ టెస్ట్ చేయాలని భావించారు.
కానీ డోప్ టెస్టుకు సంజనా నిరాకరించినట్లు తెలుస్తోంది. ఆమెకు టెస్ట్ చేసేందుకు బెంగుళూరులోని కేసీ జనరల్ ఆసుపత్రికి తరలించగా… ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగింది. పోలీసులు మాత్రం తమకు కోర్టు అనుమతిచ్చిందని, డోప్ టెస్టు తప్పనసరి అని చెప్పినా, ఎదైనా ఉంటే తన లాయర్ తనకు చెప్తారని, అప్పటి వరకు టెస్టు చేయించుకునేది లేదని సంజన తెగేసి చెప్పినట్లు సమాచారం. ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదని, ఎవరో నాకు ఫోన్ చేస్తే నేను తప్పు చేసినట్లు ఎలా అయితుందని సంజన పోలీసులతో వాగ్వాదానికి దిగింది.
అయితే ఫైనల్ గా పోలీసులు మాత్రం సంజనకు కొన్ని మెడికల్ టెస్టులు చేసి, రాగిణితో పాటు సంజనను కూడా స్టేట్ ఉమెన్ హోమ్ కు తరలించారు.