స్మార్ట్ ఫోన్ సెలబ్రిటీల చావుకొచ్చినట్టైంది.వాళ్ళు ఎందుకొచ్చారు, ఏపరిస్థితుల్లో ఉన్నారు, అది కరెక్ట్ టైమా కాదా, వాళ్ళు ఏ మూడ్ లో ఉన్నారు.అనే మినిమమ్ కామన్ సెన్స్ లేకుండా సెలబ్రిటీలను సెల్ఫీల కోసం వేధిస్తున్నారు అభిమానులు. ఎయిర్ పోర్ట్స్ లో అయితే ఈ వ్యవహారం మరింత విచ్చల విడిగా తయారైంది.
ప్రయాణ హాడావుడిలో వాళ్ళుంటే సెల్ఫీలంటూ కాళ్ళకి అడ్డం పడుతుంటారు అభిమానులు. కొందరు అభిమానుల అత్యుత్సాహం సెలబ్రిటీలను ఇబ్బందికి గురి చేస్తుంటాయి. పలుసార్లు చాలా మంది సెలబ్రిటీలకు ఇలాంటి చేదు అనుభవం ఎదురయ్యాయి.ఇలాంటి సమయాల్లో హీరో బాలయ్యబాబు లాంటి వాళ్ళే కరెక్టు అనిపిస్తుంది. తాజాగా బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్‌కు ఇలాంటి ఓ అనుభవమే ఎదురైంది.
ఇటీవల సార్ అలీఖాన్ కుటుంబంతో ఉదయ్‌పూర్ టూర్‌కి వెళ్లింది. ఉదయ్‌పూర్ పర్యటనను ముగించుకున్న సారా శుక్రవారం ముంబయి విమానాశ్రయానికి చేరుకున్నారు.ఈ సమయంలో ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వెళ్తున్న సారాతో ఫొటోలు దిగడానికి అభిమానులు వచ్చారు.
అయితే ఇదే సమయంలో ఓ మహిళా అభిమాని సారాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. అనంతరం అక్కడి నుంచి వెళుతూ సారా వెంట్రుకలను తాకే ప్రయత్నం చేసింది. దీంతో సారా ఒక్కసారిగా ఇబ్బందిగా గురైంది. అభిమానిని తప్పించుకునే ప్రయత్నం చేసింది.
@SaraAliKhan oh my honey my love my fav .. beware from such ppl .. she was either trying to get ur earing or ur hairs for black magic or something else .. but we don’t know.. it’s good to be humble wd fans but be cautious.. the world is cruel.. be safe sweetheart 🥰🥰 pic.twitter.com/JSwDJbAtTp
— Jashith Preetak Joshi (@Jashithjshi1985) February 10, 2023