సినీ ప్రపంచంలోకి ఎంటర్ అయిన తరువాత వెనుక ఉన్న బ్యాగ్రౌండ్ తో సంబంధం ఉండదు. అలా వచ్చిన వారు ఎంతో మంది ప్రస్తుతం సినీ పరిశ్రమకి కనిపించకుండా పోయిన వారు కూడా ఉన్నారు. మరి కొంతమందికి నటన బాగున్నప్పటికీ అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. వారిలో హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక రాజశేఖర్ ఒకరు.
ఆమె అందంతో, నటనతో ఎంతో ఆకట్టుకున్నప్పటికీ అదృష్టం మాత్రం కలిసి రాలేదని చెప్పవచ్చు. సినిమాలు చేస్తున్నప్పటికీ ఆఫర్లు మాత్రం రావడం లేదు. అయితే ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. 2019లో దొరసాని అనే సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమైంది.
ఆనంద్ దేవరకొండ హీరోగా తెరపైకి వచ్చిన ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది.
కానీ శివాత్మిక నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక పంచతంత్రం ఆకాశం అనే సినిమాలలో కూడా కీలక పాత్రలో నటించింది. ముఖ్యంగా తమిళంలో కూడా ఆమెకు చాలా మంచి అవకాశాలు వస్తున్నాయి.ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో నిత్యం రకరకాల ఫొటోలతో దర్శనమిస్తుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
క్యూట్ లుక్స్ తో కవ్విస్తున్న శివాత్మిక ఫోటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అందాలు వలకబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది శివాత్మిక. ఇక ఈ అమ్మడి ఫోటోలపై కుర్రాళ్ళు కొంటె కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శివాత్మిక ఒకటి రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. వచ్చిన సినిమాలన్నీ ఒప్పుకుంటూ పోకుండా ఆచి తూచి అడుగులేస్తోంది ఈ భామ.