కమల్ హాసన్ వారసురాలిగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన బామ శృతిహాసన్. కెరీర్ ఆరంభంలో సినిమాలు చేసినప్పటికీ వరుస ఫ్లాప్ లు ఈ అమ్మడిని వెంటాడాయి. కానీ ఆ తరువాత గబ్బర్ సింగ్ సినిమాతో మంచి హిట్ సాధించింది. ఆ తరువాత వరుస హిట్ లతో దూసుకుపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూ మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితం గురించి తెలిపింది.
కరోనా మనకు చాలా విషయాలు నేర్పించింది. జీవితంలో అతి ముఖ్యమైనవి ఏంటో నాకిప్పుడే అర్థమైంది. అందరిలాగానే నాకు కొన్ని సమస్యలున్నాయి. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులున్నాయి. ఈఎమ్‌ఐలు కట్టాలి. అయితే డబ్బులు కావాలని మా పేరెంట్స్‌ను నేను ఎప్పుడూ అడగలేదు. నేను ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీతోనే ముందుకెళతా. ఒక విషయాన్ని మనసులో బలంగా అనుకుంటే అది కచ్చితంగా నెరవేరుతుందని నమ్ముతాన`ని శ్రుతి చెప్పుకొచ్చింది.