మందు బాబులు టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. మందు భామలు కొందరే అయినా శృతిమించి మద్యం పుచ్చుకునే హీరోయిన్లు కొందరే. పాతతరంలో సావిత్రి ప్రేమ వియోగంతో దేవదాసులా మందు అలవాటు చేసుకుంది. మరీ అదే పనిగా మందు తాగే స్థాయికి దిగజారింది. ఈ తరం అందాల భామ, విశ్వ నటుడు కమల్ హాసన్, సారిక కూతురు, ప్రముఖ హీరోయిన్ శృతి హాసన్ ప్రస్తుతం శృతి మించి మద్యానికి బానిస అయిందట. ఈ సంచలన విషయాన్ని స్వయంగా మంచు లక్ష్మికి ఇచ్చిన ఇంటర్వ్యూలో శృతి వెల్లడించింది. కొద్ది కాలంగా సినిమాలకు దూరమై విపరీతంగా విస్కీ తాగిందట. రెండేళ్లు విపరీతంగా మద్యం సేవించి మత్తులో మునిగిపోయిందట. విస్కీ బాటిల్ కి బానిసనయ్యానని శృతి హాసన్ తన వీక్ పాయిట్ బయట పెట్టేసింది. విస్కీ తాగి తాగి చివరకు అనారోగ్యానికి గురయ్యానని వెల్లడించింది.
మందు అలవాటు మానుకోవడం అంత ఈజీ కాదు. అందుకే అనారోగ్యం నుంచి కోలుకోవడానికి శృతికి చాలా సమయం పట్టింది. ఆ సమయంలో సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం కెరీర్ పైనే దృష్టి పెట్టిన శృతి అసలు అంతగా విస్కీకి బానిస కావడానికి కారణమేమిటనేది చర్చ నీయాంశమైంది. బాయ్ ఫ్రెండ్ మైఖేల్ నుంచి శృతి ఇటీవలే విడిపోయిన తర్వాత తాను కూడా ప్రేమ వియోగంతో మందుకు బానిస అయిందా? అనే ప్రశ్న ఎదురవుతోంది. ఎన్నో మూవీల్లో ప్రేమ విఫలమై మందులో మునిగిన కేరెక్టర్లు ఉన్నాయి. కానీ శృతి మాత్రం శృతి మించి మందులో మునిగినా వెంటనే మామూలు లోకంలోకి వచ్చేసింది. పవన్ కళ్యాణ్ కాటమరాయుడు తర్వాత తెలుగు పరిశ్రమకు దూరమైన శృతి త్వరలో రవితేజ సినిమాతో రీ-ఎంట్రీ ఇవ్వనుంది.