తెలుగులో ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్ వహించిన “ఐతే.!” చిత్రం తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పరిచయం అయిన “ముంబై బ్యూటీ సింధు తులాని” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. అయితే సింధు తులాని ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలో హీరోయిన్ గా నటించి తెలుగు సినీ ప్రేక్షకులని బాగానే అలరించింది. అలాగే అప్పుడప్పుడు కొంతవరకు నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలలో కూడా కనిపించి సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలే సంపాదించుకుంది.
ఈమె నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి కేరక్టర్స్ లో నటించిన మూవీస్ లో “మన్మధ” మూవీ ద్వారా మంచి గుర్తింపు తెచ్చింది. అయితే కొంతకాలం పాటు హీరోయిన్ గా సింధు తులాని బాగానే రాణించినప్పటికీ తన తదుపరి చిత్రం కథల విషయంలో కొంత మేర అవగాహన లోపించడంతో ఈ అమ్మడు హీరోయిన్ గా నటించిన చిత్రాలు థియేటర్ దగ్గర అనుకునంతా హిట్ అందుకోలేదు. దీంతో ప్రస్తుతం సింధు తులాని క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాంటి పాత్రలో యాక్ట్ చేస్తుంది.
కాగా ఆ మధ్య టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించినటువంటి సన్ ఆఫ్ సత్యమూర్తి అనే మూవీ లో హీరో వదిన పాత్రలో నటించింది . అయితే చివరిగా సింధు తులాని తెలుగులో చిత్రాంగద అనే మూవీలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు ఆమె తెలుగు ఇండస్ట్రీలో యాక్ట్ చేయలేదు. అయితే ఈ విషయం ఇలా ఉండగా సింధు తులానీ హీరోయిన్ గా నటించిన “అతనొక్కడే, గౌతమ్ ఎస్.ఎస్.సి, హరే రామ్, బతుకమ్మ, తదితర సినిమాలు ప్రేక్షకులని బాగానే ఆకర్షించింది.
ఇక మూవీస్ లు హీరోయిన్ ఛాన్సులు తగ్గిపోయిన తర్వాత గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలలో కూడా సింధు తులాని దర్శనం ఇచ్చింది. ప్రస్తుతం సింధుతులాని తన ఫ్యామిలీ తో కలిసి ముంబైలో ఉంటున్నట్లు తెలుస్తుంది. సినీమాలో హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న సమయంలో తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడి ఏడాది పాటు సినిమాలకు దూరమైంది. సింధుతులాని భర్త ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. వీరికి శ్వేత అనే కుమార్తె ఉంది.