బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య ఘటన గంటగంటకు మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఆమె తల్లి పాప రత్నం ఆసక్తికర విషయాలను వెల్లడించారు శ్రావణి ప్రియుడు దేవరాజు వల్లనే చనిపోయిందని సాయి చాలా మంచివాడు అని చెప్పుకొచ్చింది. ఈ నెల 7న దేవరాజు తో కలిసి శ్రావణి ఎస్ ఆర్ నగర్ లోని ఓ రెస్టారెంట్ కి వెళ్లగా వారిద్దరినీ సాయి చూసి ఆమెను కొట్టిన విషయం తెలిసిందే.
అనంతరం ఆమె ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆమెను కుటుంబ సభ్యులతో కలిసి కొట్టారన్న మాట పై కూడా స్పందించింది. దేవరాజు తన కూతురుతో ప్రేమ నాటకం ఆడారని తెలిపారు. చనిపోయేముందు బాత్రూమ్ నుంచి దేవరాజు కు ఫోన్ చేసిందని పెళ్లి చేసుకుంటానని ఆయన మాట ఇవ్వలేదని చెప్పారు. ఈ కారణంతో ఆత్మహత్య చేసుకుందని. ఒకవేళ ఆ రోజు సాయి లేకపోతే మాఇంట్లో కుటుంబ సభ్యులందరూ చనిపోయి ఉండేవాళ్ళని చెప్పారు. సీరియల్స్ వాళ్ళు ఎత్తు పన్ను ఉందని చెప్తే తమ కూతురు పది వేలు పెట్టి పన్ను సరి చేయించిందని చెప్పారు. అతడు తన కూతురు దగ్గర చాలా సార్లు డబ్బులు తీసుకున్నాడు అని తెలిపారు.