నటి శ్రీరెడ్డి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వివాదాస్పద నటి గా పేరు తెచ్చుకున్న శ్రీ రెడ్డి ఇప్పుడు నాగ చైతన్య, సమంత లకు ఓ సందేశాన్ని ఇచ్చింది. అది ఏంటంటే… ఇటీవల వీరిద్దరూ కూడా విడాకులు తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇదే విషయాన్ని గురించి చెబుతూ…సంసారం అన్నప్పుడు చిన్న చిన్న గొడవలు వస్తాయని…వాటన్నింటిని పరిష్కరించుకుని కొన్ని విషయాల్లో రాజీ పడుతూ ఉండాలని చెప్పుకొచ్చింది శ్రీ రెడ్డి. నాగ చైతన్య అన్నయ్య , సమంత వదిన ఇద్దరు కూడా సంసారంను చక్క బెట్టుకునేందుకు ఒకరు కాస్త తగ్గాలని విజ్ఞప్తి చేసింది.
ఇద్దరు కూడా చాలా మందికి ఆదర్శంగా, చాలా బ్యూటీఫుల్ కపుల్ గా పేరు దక్కించుకున్నారు. అలాంటి మీరు విడి పోతే చాలా మంది బాధ పడుతారు. సమంత వదిన నువ్వు సంసారాన్ని చక్క బెట్టుకో , కావాలంటే మోడలింగ్.. సినిమాలు ఏమైనా ఒక హద్దు వరకు చేసుకో అని శ్రీరెడ్డి పేర్కొంది.