క్యాస్టింగ్ కౌచ్ పేరుతో టాలీవుడ్ లో సంచలనం రేపిన శ్రీరెడ్డి మరో సారి వార్తల్లో నిలిచింది. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. అటు టాలీవుడ్, కోలీవుడ్, రాజకీయనాయకులు ఎవ్వరిని వదల్లేదు. టాలీవుడ్ అగ్రహీరోలు చిరంజీవి, నాగార్జున పై అయితే బూతుపురాణం అందుకుంది. బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి కి మీకు ఉన్న సంబంధం ఏంటని అడిగితే సో హాట్.. సో క్యూట్ అంటూ సమాధానం చెప్పుకొచ్చింది. తమిళనాడులో స్టాలిన్ కొడుకు ఉదయనిధితో మీకు సంబంధం ఏంటని ప్రశ్నించిన యాంకర్ కు షాక్ ఇచ్చింది. త్వరలోనే తమిళ్ ఇండస్ట్రీలో కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తానంది.
పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకుని కూడా శ్రీరెడ్డి మరో సారి కౌంటర్ వేసింది. నాకు అవకాశం ఉంటే మెగా ఫ్యామిలీ మీద సీబీఐ ఎంక్వయిరీ జరపాలని కోరుతానంది. జగన్ ను నేను ఒక్కటే కోరుకుంటున్నానని.. వ్యభిచారం చేసుకునే వాళ్ళ జోలికి దయచేసి వెళ్ళకండి అంటూ శ్రీ రెడ్డి విజ్ఞప్తి చేసింది. శ్రీరెడ్డి మాటలు ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారాయి.
