వివాదస్పద నటి, వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిన శ్రీరెడ్డి మరో కాంట్రవర్షియల్‌కు తెర తీసింది. శివరాత్రి సందర్భంగా… అఘోరా వేషంలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆమెను చూసిన అభిమానులు ఫైర్ అవుతున్నారు.
మెడలో రుద్రాక్షలు, చేతిలో ఢమరుకం, మరో చేతిలో కర్ర పట్టుకొని… అఘోరాగా టిక్ టాక్ వీడియో చేసింది శ్రీరెడ్డి. దీంతో పవిత్రమైన శివరాత్రి రోజు ఎందుకిలా అంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఇంకా ఎన్ని రోజులో ఈ వెకిలి చేష్టలు అని కొందరు, అఘోరాలను అవమానించటమేనని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఇటీవలే రాకేష్ మాస్టర్, కరాటే కళ్యాణిలను టార్గెట్ చేస్తూ… బూతులు తిట్టిన శ్రీరెడ్డిపై కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది.