విషయం ఏదైనా వివాదాస్పదం చేయడం నా నైజం అంటోంది శ్రీరెడ్డి. సంబంధం లేని విషయాల్లో తలదూర్చి వివాదాల్లోకెక్కడం ఈమెకు అలవాటే. మళ్ళీ ఎం జరిగిందనేగా మీ డౌట్. కరోనాపై పోరాటం చేస్తోన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సినీతారలు తమ వంతుగా సహాయం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే యంగ్ రెబల్ స్టార్ ప్రధానమంత్రి సహాయనిధికి 3కోట్ల విరాళం ప్రకటించగా.. తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షల చొప్పున తన వంతు విరాళం ప్రకటించాడు. దీంతో శ్రీరెడ్డి ప్రభాస్ ను డార్లింగ్ అంటూ ప్రశంసిస్తూ ఆకాశానికేత్తేసింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ పై కుడా శ్రీరెడ్డి ప్రశంసల జల్లు కురిపించింది. తన ఫేస్ బుక్ ఖాతాలో కరోనాపై యుద్ధంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయం చేస్తోన్న సినీతారలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభాస్‌కు అయితే థ్యాంక్స్ డార్లింగ్.. నువ్వు విరాళంలో ఆ పావళాను (పవన్ కళ్యాణ్ )ను మించిపోయావ్ అంటూ మరోసారి పవర్ స్టార్ ను టార్గెట్ చేసింది శ్రీరెడ్డి. కరోనా విషయంలో కేంద్ర, రాష్ట్ర సర్కార్ లకు మెగా హీరోలు కుడా విరాళం ప్రకటించిన వారెవ్వరిని శ్రీరెడ్డి పట్టించుకోలేదు. ఇంకా పవన్ ప్రకటించిన 2 కోట్ల విరాళంపై వ్యంగ్యంగా కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి. కటింగ్ కు కుడా పైసల్లెవని చెప్పే ..పవన్ 2కోట్లు ఎక్కడి నుంచి అప్పు చేసి తీసుకొచ్చాడు అంటూ పవన్ ను మరోసారి కెలికింది.