నటి సుధ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. హీరో తల్లిగా హీరోయిన్ తల్లిగా సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు సుధ. వృత్తిపరంగా హ్యాపీ గా ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు అని ఇప్పటికీ కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. తాజా గా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
సినిమాల్లో బాగానే సంపాదించానని ఢిల్లీ లో ఓ హోటల్ కూడా పెట్టానని అన్నారు. అక్కడ మంచి లాభాలు వచ్చాయని అయితేఅది చూసి మరో హోటల్ పెట్టానన్నారు.
అక్కడ మాత్రం నష్టాలు వచ్చాయని అన్నారు. ఆ తరువాత మా నాన్నగారు చనిపోయారు. నిజానికి మా నాన్న గారికి క్యాన్సర్ అనగానే మా బంధువులంతా దూరం అయిపోయారని అన్నారు.
నా భర్త, కొడుకులు కూడా నాకు దూరంగా యూఎస్‌లో ఉంటున్నారన్నారు. కానీ వాళ్లకూ ఏదో ఒక రోజు నా పరిస్థితే వస్తుంది. చాలామందికి తెలియక పోవచ్చు. మాతృదేవోభవ సినిమాలోని చాలా సంఘటనలు నా నిజ జీవితంలో నిజంగా జరిగాయి అంటూ చెప్పుకొచ్చారు సుధ.