క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి.. రెండో పెళ్లి చేసుకోబోతున్నారని రెండు రోజులుగా సోసల్ మీడియాలో జోరుగా పోస్టులు దర్శనమిస్తున్నాయి. సింగర్ సునీత పిల్లలలాగే.. సురేఖ వాణి కుమార్తె కూడా రెండో పెళ్లికి అంగీకారం తెలిపిందని, దీంతో త్వరలోనే ఆమె రెండో వివాహం చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతూ వచ్చింది. వీటన్నింటికి తాజాగా ఆమె ఫుల్‌స్టాప్ పెట్టారు.
రెండో వివాహం చేసుకునే ఆలోచన తనకు లేదని ఆమె స్పష్టం చేశారు. అవన్నీ అవాస్తవాలేనని తెలిపారు. యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన సురేఖ… ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో సోదరి, పిన్ని, భార్య వంటి పాత్రల్లో మెప్పించారు. భద్ర, బొమ్మరిల్లు, బృందావనం, దుబాయ్ శీను, శ్రీమంతుడు వంటి సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చాయి.