బుల్లితెర హిందీ నటి వైశాలి టక్కర్ ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మరణంతో హిందీ బుల్లితెర ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వైశాలి.. ఇండోర్ లోని తన నివాసంలో ఆదివారం ఉరేసుకుని మరణించింది. కాగా ఈ విషయాన్ని తేజాజీ నగర్ పోలీసులు అధికారికంగా వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ క్రమంలోనే ఆమె నివాసంలో సూసైడ్ నోట్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు పోలీసులు. లవ్ వ్యవహారం కారణంగానే 30 ఏళ్ల వైశాలి చనిపోయిందని అనూమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా దివంగత బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు వైశాలి మంచి స్నేహితురాలు.
అయితే వైశాలి సూసైడ్ కి పాల్పడిన క్రమంలో ఇన్ స్టాగ్రామ్ లో ఆమె చివరి పోస్ట్ వైరల్ గా మారింది. ఇందులో ఆమె ద్విపాత్రాభినయం చేస్తూ తన బాయ్ ఫ్రెండ్ ను పరీక్షించింది. ఈ టెస్ట్ లో అతడు తనను మోసం చేయడంతో వైశాలి బండ బూతులు తిట్టింది. అయితే ఈ వీడియోకు ఆమె కామెడీ, ఫన్నీ వీడియోస్ అన్న ట్యాగులను జత చేసింది.
అలాగే సరిగ్గా వారం కిందట ఆమె పోస్ట్ చేసిన మరో వీడియో సైతం వైరల్ అవుతోంది. ఆదివారం మీరేం చేస్తారు? నేనైతే ఇదిగో ఇలా ఖాళీగా ఉండి ఫ్యాన్ తిప్పుతూ ఉంటానని చూపించింది. ఇది చూసిన నెటిజన్లు మరింత ఎమోషనల్ అవుతున్నారు. ఫ్యాన్ చూపిస్తూ మీరు అప్పుడే హింట్ ఇచ్చారు. కానీ మేమే అర్థం చేసుకోలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram