ప్రముఖ నటి వీణా కపూర్(74) దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన ముంబైలో కలకలం రేపింది. ఆస్తి తగాదాల కారణంగా వీణా కపూర్ ను తన కొడుకే హత్య చేసినట్లు తెలుస్తోంది. మర్డర్ చేసిన అనంతరం ఆమె మృతదేహాన్ని మథేరన్ హిల్ స్టేషన్ సమీపంలో పడేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ నటి వీణా కపూర్ టీవీ యాక్టర్. ఆమెకు ఇద్దరు కుమారులుండగా.. ఒకరు అమెరికాలో ఉంటున్నాడు. మరొకరు వీణా కపూర్ తో ముంబైలోని జూహులో కలిసి ఉంటున్నారు. అతని పేరు సచిన్ కపూర్. అయితే ఆస్తి విషయమై తల్లి కొడుకుల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉండేవి.
వీణా కపూర్ పేరు మీద ఖరీదైన ప్లాట్ ఉంది. దాని విలువు సుమారు 12 కోట్ల రూపాయలు. ఆ ప్లాట్‌ని తన పేరు మీద రాయమని వీణా కపూర్ కొడుకు.. తల్లిని వేధించేవాడు. ఈ క్రమంలోనే హత్య జరిగిన రోజు కూడా.. వారి మధ్య వివాదం చోటు చేసుకుంది. అప్పటికే తల్లి మీద కోపంతో రగిలిపోతున్న సచిన్ కపూర్ మంగళవారం ఉదయం తన ఇంట్లో పని మనిషితో కలిసి బేస్ బాల్ బ్యాట్ తో ఆమెను కొట్టి చంపాడు.
తర్వాత వీణా కపూర్ మృతదేహాన్ని 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవికి తీసుకెళ్లి పూడ్చి పెట్టి వచ్చాడు. వీణా కపూర్ మరొక కుమారుడు అమెరికాలో ఉంటున్నాడు. ఎన్ని సార్లు తల్లికి ఫోన్ చేసినా మాట్లాడకపోవటం, లిప్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి ముంబై పోలీసులకు సమాచారం అందించాడు.
వారు రంగంలోకి దిగడంతో జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత పోలీసులు వీణా కపూర్ ని హత్య చేసిన ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఆస్తి కోసమే తల్లిని హత్య చేశానని సచిన కపూర్ నేరం అంగీకరించాడు. ఈ మొత్తం వివరాలను వీణా కపూర్ సహా నటి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వీణా కపూర్ మృతి పట్ల అభిమానులు సంతాపం తెలుపుతున్నారు.