టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ “సుహాసిని” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. అప్పట్లో స్టార్ హీరోల సరసన నటించి వావ్ అనిపించారు. తన పెర్ఫార్మెన్స్ తో హీరోలకు ధీటుగా నటించి ప్రేక్షక లోకంతో దట్ ఈజ్ సుహాసిని అనిపించారు.
ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, తదితర హీరోలతో కలిసి హీరోయిన్ గా నటించి సినిమా జీవితంలో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా కెరీర్ని కొనసాగించారు సుహాసిని. తర్వాత దిగ్గజ దర్శకుడు మణిరత్నం తో ఆమెకు వివాహం జరిగింది. ఈమెకు ఒక కుమారుడు ఉన్నాడు.
ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా పాత్రలను చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉన్నారు. దర్శకులను చూసి సినిమా ఒప్పుకుంటున్నారు. దానివల్లే సుహాసిని వెండితెరమీద అంతగా కనిపించడం లేదు. ఇటీవల వెబ్ సిరీస్ లో ఏకంగా అమ్మమ్మ పాత్ర ద్వారా ప్రేక్షకులను అలరించారు.
సుహాసిని బాలకృష్ణతో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. మంగమ్మగారి మనవడు, బాలగోపాలుడు, ప్రెసిడెంట్ గారి అబ్బాయి వంటి ఎన్నో చిత్రాల్లో ఆమె నటించారు. అయితే సుహాసిని బాలకృష్ణ సరసన హీరోయినిగానే కాకుండా.. తల్లిగా కూడా నటించారు. బోయపాటి శ్రీను దర్శకత్వం లో 2014 లో బాలకృష్ణ లెజెండ్ మూవీ లో నటించారు.
ఈ చిత్రం లో బాలకృష్ణ కి తల్లి పాత్రలో సుహాసిని కనిపించారు. ఇలా సుహాసిని బాలకృష్ణ సరసన హీరోయిన్ గా.. తల్లిగా అద్భుతంగా నటించారు. సుహాసిని సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారు.
తన సినిమాలు, ప్రాజెక్ట్‌లు, షోలకు సంబంధించిన క్యాస్టూమ్స్‌తో సుహాసిని ఫోటో షూట్ చేస్తుంటుంది. ఆ ఫోటోలను తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేస్తుంటారు. ఇక ఇప్పుడు ఆమె కొన్ని తెలుగు చిత్రాలను కూడా చేస్తోన్నారు.
చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా సుహాసిని తనకు నచ్చిన పాత్రలను పోషించుకుంటూ వెళ్తోన్నారు. అంతే కాకుండా తమిళ చిత్రాలతోకూడా ఆమె బిజీ గా ఉన్నారు.