కర్రసాము చేస్తూ బిజీగా ఉన్నానంటుంది కుర్రభామ అదా శర్మ.కమాండో పార్ట్ – 4 ప్రాజెక్ట్ చేయడము కత్తిమీద సాము అంటోంది. లేటెస్ట్ ఫొటోషూట్తో అభిమానుల మనసులు దోచేసింది.
మరాఠీలో అక్కడి ఉగాది పండుగ గురించి ఓ వీడియో తెలిపింది. అదా చెప్పిన ఈ ముద్దు ముద్దు మాటలకు అభిమానులు ఫిదా అయిపోయారు. ‘కమాండో పార్ట్ 4’ సినిమా కోసం కర్ర సాము చేస్తున్న ఓ వీడియోను నెట్టింట్లో పోస్ట్ చేసి తన టాలెంట్తో అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఇక అప్పుడప్పుడు తన లేటెస్ట్ ఫొటోలతో పాటు కొన్ని వీడియోలు పోస్ట్ చేస్తూ అభిమానులతో టచ్లో ఉంటుంది. అయితే తాజాగా ఈ సినిమా కోసం తన ఆహారం విషయంలో కోతుల నుంచి స్ఫూర్తి పొందుతున్నట్లు తెలిపింది.
ఫిట్నెస్ దృష్ట్యా ప్రస్తుతం ఆమె బనానా డైట్ ఫాలో అవుతున్నట్లు చెప్పింది. దాంతో పాటు మరిన్ని విషయాలిను అభిమానులతో పంచుకుంది. ఫిట్నెస్ దృష్ట్యా ఈ తార ఇప్పుడు బనానా డైట్ను ఫాలో అవుతోందట. ఇంతకీ ఈ డైట్ ఏంటంటే.
అరటిపండులో విరివిగా దొరికే పొటాషియం మన ఇది చర్మంతో పాటు, వెంట్రుకలకు మేలు చేస్తుంది. దీంతో పాటు జీర్ణవ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. ఇక బనానా మూడ్‌ను క్రమబద్ధీకరించే ట్రిప్టోపాన్ అనే పదార్థాన్ని కూడా విడుదల చేస్తుంది.
ఆ రసాయనం మెదడులో సెరోటినిన్‌గా మారి మనిషి మానసిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. అలాగే మనల్నీ ఎల్లప్పుడు ఉత్తేజకరంగా, ఆనందంగా ఉండేలా చేస్తుంది.
ఈ బనానాల విషయంలో నేను కోతులతో పాటు గొరిల్లాలను చూసి స్ఫూర్తి పొందాను. అవి అరటిపండ్లను ఎక్కువగా తింటుంటాయి. అందుకే అవి అంత సరదాగా, ఉత్సాహంగా కనిపిస్తాయి.
కమాండోలో నేను ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాను. ఆ యూనిఫారం ధరిస్తే మీరు కూడా బాధ్యతాయుతంగా ఉన్నట్లు ఫీల్ అవుతారు. ఇందులో నేను భావనరెడ్డి అనే పాత్రలో నటిస్తున్నాను.
ఈ బీటౌన్ బ్యూటీ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. కమాండో-4తో పాటు ది కేరళ స్టోరీ అనే మరో బాలీవుడ్ సినిమాలోనూ నటిస్తోంది. త్వరలో ఇంకో ప్రాజెక్ట్క్లకు కూడా సైన్ చేయనున్నట్లు సమాచారం.