కాస్టింగ్ కౌచ్…టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లో బాగా వినిపిస్తున్న పేరు. అయితే ఇదే విషయమై చాలా మంది ఇటీవల గొంతు విప్పారు. చిన్న ఆర్టిస్ట్ నుంచి పెద్ద హీరోయిన్స్ వరకు తమకు ఎదురైన అనుభవాలను చెప్పుకుంటున్నారు. తాజాగా ఇదే విషయం పై అదాశర్మ స్పందించింది.
కాస్టింగ్ కౌచ్ కు అక్కడ ఇక్కడ అనే తేడా లేదు. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేదు. ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇక్కడ బలవంతం ఉండదు. నిర్ణయం తీసుకోవాల్సింది మనమే. మనకు ఇష్టం లేకపోతే ఎవరూ బలవంతం చెయ్యరు’ మహిళలు అన్ని చోట్లా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారంటూ చెప్పుకొచ్చింది.