అదానీ కంపెనీ షేర్లు మరోసారి ఢమాల్ మంటున్నాయి. రెడ్ జోన్ లో ట్రేడ్లు కొనసాగుతున్నాయి. స్టాక్ మార్కెట్ కు బ్యాడ్ ట్రేడ్ కనిపిస్తోంది. అందుకే మార్కెట్ ప్రారంభమైన వెంటనే సన్సెక్స్ 60,000 దిగువకు పడిపోయింది. ఇందులో బిలియనీర్ అదానీకి చెందిన కంపెనీల షేర్లు..కూడా దారుణంగా పడిపోతున్నాయి. అయితే దీనికి హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదిక సృష్టించిన పెను సంచలనమే కారణం.
బిలియనీర్ అదానీకి చెందిన కంపెనీల షేర్లు రెడ్ జోన్లో ట్రేడ్ అవుతున్నాయి. వరుసగా రెండవ ట్రేడింగ్ సెషన్ లో కూడా అదే సీన్ రిపీట్ అవుతోంది. శుక్రవారం ఉదయం అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్ లు భారీ పతనంతో ప్రారంభమయ్యాయి. మార్గెట్ ప్రారంభమైన వెంటనే అదానీ గ్రూప్ స్టాక్స్ 19 శాతం పడిపోయాయి. అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్ షేర్లను తగ్గించిన తర్వాత అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు వరుసగా రెండో రోజు కూడా అదానీ కంపెనీ షేర్లు దిగువకు జారీ పోతున్నాయి. షేర్ల 85 శాతం ఓవర్ వాల్యుయేషన్ నుంచి కార్పొరేట్ గవర్నెన్స్ వరకు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అదానీ ట్రాన్స్ మిషన్ స్టాక్ ప్రారంభమైన వెంటనే 19 శాతం పడిపోయింది. ఈ షేరు బుధవారం 2517 వద్ద ముగిసింది. మార్కెట్ ప్రాంరభమైన తర్వాత ఒక్కో షేరు 482 రూపాయలు పడిపోయింది. ప్రస్తుతం ఈ షేరు 13.22 శాతం పతనంతో 2177 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. అదానీ టోటల్ గ్యాస్ స్టాక్ లో కూడా భారీ క్షీణత ఉంది. ఈ షేరు చివరి ముగింపు 3660 నుంచి 700 దగ్గర అంటే 19 శాతం 2963 రూపాయలకు పడిపోయింది. ప్రస్తుతం ఈ షేరు 13.66 శాతం పతనంతో 3147 రూపాయల వద్ద ట్రేడవుతోంది.
అదానీ గ్రీన్ ఎనర్జీ స్టాక్ మునుపటి ముగింపు స్థాయి 1857 నుంచి 15.77 శాతం క్షీణించి 293 రూపాయలకు పడిపోయింది. ప్రస్తుతం ఈ షేరు 7.74 శాతం పతనంతో రూ.1714 వద్ద ట్రేడవుతోంది. ఇక అదానీ గ్రూప్ లోని ఇతర స్టాక్ లలో అదానీ పవర్, అదానీ విల్మార్ కూడా 5 శాతం క్షీణించాయి. రెండు స్టాక్ లు లోయర్ సర్క్యూట్ లో ఉన్నాయి. బుధవారం 713 రూపాయల వద్ద ముగిసిన అదానీ పోర్ట్స్ స్టాక్ ప్రారంభమైన 675కి పడిపోయింది. ప్రస్తుతం ఈ షేరు 2.63 శాతం క్షీణించి 695 రూపాయల వద్ద ట్రేడవుతోంది.