హిడెన్ బర్గ్ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్ కు అమెరికా స్టాక్ మార్కెట్ లో షాక్ తగిలింది. అదానీ గ్రూపునకు చెందిన అదానీ ఎంటర్ ప్రైజెస్‌ను సస్టైనబుల్ ఇండిసెస్ జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ఎస్ అండ్ పీ డౌ జోన్స్ ఇండెక్స్ ప్రకటించింది.

దేశీయ స్టాక్ మార్కెట్లలో శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌లో అదానీ గ్రూపునకు చెందిన స్టాక్స్ భారీగా పతనమయ్యాయి. అదానీ పోర్ట్స్ 7 శాతానికిపైగా, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 27 శాతం, అదానీ గ్రీన్ 10 శాతం, అదానీ ట్రాన్స్‌మిషన్ 10 శాతం, అదానీ విల్మర్ 5 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 5 శాతం, అదానీ పవర్ 5 శాతం నష్టపోయాయి.
అదానీ గ్రూప్ అనుబంధ కంపెనీలు ఏసీసీ 5 శాతం, అంబుజా సిమెంట్స్ 8 శాతం, ఎన్డీటీవీ 5 శాతం పడిపోయాయి. ఫలితంగా అదానీ సంపద విలువ మరింత క్షీణించింది. ఇప్పటికే ఆయన భారత్ లో అత్యంత సంపన్నుడి స్థానాన్ని కోల్పోయారు.