అదానీ గ్రూపు వ్యవహారంపై సుప్రీం కోర్టులో తాజాగా మరో పిటిషన్ దాఖలైంది. ఈ వ్యవహారంపై అత్యవసర విచారణ జరపాలంటూ కాంగ్రెస్ నేత జయ ఠాకూర్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పాటు అదానీలో పెట్టుబడులు పెట్టిన ఎల్ఐసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాత్రపై విచారణ జరపాలని కోరారు.
వాటిపై సీబీఐ, ఈడీ, డీఆర్‌ఐ, సెబీ, ఆర్బీఐ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని పిటిషన్ లో ఆయన కోరారు. ఈ దర్యాప్తు అంతా సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో జరగాలని అభ్యర్థించారు.
ఈ పిటిషన్ పై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వవంలోని ధర్మాసనం విచారణ స్వీకరించింది. ప్పటికే దాఖలైన రెండు పిటిషన్లతో కలిపి ఈ పిటిషన్ పై శుక్రవారం విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది. మరోవైపు అదానీ గ్రూప్ ఆర్థిక అవకతవకలపై ఆర్బీఐ, సెక్యూరిటీ ఎక్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియాలను కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ కోరారు.
ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్, సెబీ చైర్ పర్సన్ మదాబీ పురి బుచ్‌లకు లేఖ రాశారు. అదానీ గ్రూపు తీసుకున్న అధిక రుణాల వ్యవహారంలో భారత బ్యాంకింగ్ వ్యవస్థ దెబ్బ తినకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.