అద్దంకి దయాకర్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు
రాష్ట్రంలోని 17 లక్షల కుటుంబాలకు దళిత బంధు కింద రూ.10 లక్షలు ఇవ్వాలి. రాజ్యాంగ బద్ధంగా రావాల్సిన నిధులు కేటాయించాలి. ప్రజల పన్నుల నుండి వచ్చిన నిధులను ప్రజలకే చెల్లించాలి. దళితు బంధు దళితులందరికీ అందే వరకు నిద్రపోయేది లేదు. మరోసారి దళితులు మోసపోయే అవకాశం లేదు.
రాజకీయంగా దళితులను వాడుకోడానికే కేసీఆర్ దళిత బంధు పథకాన్ని తెచ్చారు. వాసాలమర్రిలో పథకాన్ని అమలు చేయడం సంతోషకరం. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి ముఖ్యమంత్రి తన చిత్తశుద్దిని చాటుకోవాలి. దళిత బంధు ఆగిన క్షణం నుండి కేసీఆర్ పతనం ప్రారంభమవుతుంది. కోవర్టులకు, తెలంగాణ ద్రోహులకు పదవులను ఇస్తూ నిజమైన ఉద్యమకారులను ఆయన పక్కన పెట్టారు.