మెదక్ జిల్లా నర్సాపూర్ రెవెన్యూ పరిధిలోని 112ఎకరాల భూ వివాదంపై ఏసీబీ దర్యాప్తులో రిటైర్డ్ ఐఏఎస్ పేరు తెరపైకి వస్తుంది. తన రిటైర్మెంట్ రోజునే కలెక్టర్ ధర్మారెడ్డి ఎన్వోసీ ఇచ్చేందుకు అంగీకరించటం, రిజిస్ట్రేషన్ శాఖకు లేక రాయటంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతుండగా… తాజాగా మరో అంశం తెరపైకి వచ్చింది.
నర్సాపూర్ భూమి కేసులో అక్కడ ఎమ్మార్వోగా ఉన్న మాలతి 11రోజుల పాటు సెలవుపై వెళ్లింది. తహశీల్ధార్ మాలతి జూన్ 21న సెలవుపై వెళ్లింది. అదే రోజున ఎమ్మార్వో ఆఫీసుకు ఈ 112ఎకరాల ఫైలు వచ్చింది. ఆమె సెలవుపై వెళ్లటంతో ఆమె స్థానంలో ఇంచార్జీగా బాధ్యతలు చేపట్టిన అబ్ధుల్ సత్తార్ కేవలం రెండ్రోజుల్లోనే ఫైలుపై సంతకం చేసి జూన్ 23న ఆర్డీవోకు పంపారు. ఆమె కూడా ఫైల్ ను ఆమోదిస్తూ జులై 31న కలెక్టర్ ధర్మారెడ్డికి ఫైల్ పంపగా… అదే రోజు ధర్మారెడ్డి రిజిస్ట్రేషన్ శాఖకు లేఖ రాశారు. ఈ మొత్తం వ్యవహారంలో అడిషనల్ కలెక్టర్ నగేష్ పాత్ర ఉందని ఏసీబీ అనుమానిస్తుండగా, నిషేధిత భూముల జాబితా నుండి ఆ భూమిని తీసేందుకు అధికారులు అంత స్పీడ్ గా పనిచేయటం వెనుక ఈ అవినీతి కథే ఉంటుందని ఏసీబీ అనుమానిస్తుంది.
ఈ మొత్తం వ్యవహరంలో ఎమ్మార్వో మాలతి సహకరించనుందునే ఆమెను సెలవుపై పంపారా…? ఆమెకు ఈ విషయం తెలుసా…? ఆమె ఈ విషయంలో సహకరించిందా…? అన్న అంశాలపై ఇప్పటికే ఎమ్మార్వో మాలతిని ఏసీబీ విచారించింది. అన్ని అంశాలతో త్వరలోనే కలెక్టర్ ధర్మారెడ్డిని విచారించే అవకాశం కనపడుతుంది.