తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్ పీఎస్ సీ పేపర్ల లీకేజీ ఘటన ఎన్ని ప్రకంపనలు సృష్టిస్తుందో తెలిసిందే. ఓ యువతి కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పని చేసే ప్రవీణ్ అనే ఉద్యోగియే ఈ పేపర్లను లీక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
అతన్ని అదుపులోనికి కూడా తీసుకున్నారు. ఈ వ్యవహారం నడుస్తుండగానే గ్రూప్ 1 పేపర్ కూడా లీక్ అయ్యిందని వార్తలు గుప్పుమన్నాయి.
ఈ వార్తలు పై అదనపు సీపీ విక్రమ్ సింగ్ స్పందించారు. దీని గురించి అధికారికంగా వివరణ ఇచ్చారు.
ప్రస్తుతం టీఎస్ పీఎస్ సీ పేపర్ల లీకేజీ ఘటన పై విచారణ జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో ప్రవీణ్ తో పాటు మరో 9 మందిని అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నట్లు ఆయన వివరించారు.
గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ లీకైనట్లు తమకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని వెల్లడించారు. వివిధ కోణాల్లో లీకేజీ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.