అధికార టీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆదిభట్ల మున్సిపల్ చైర్మన్ కొత్త ఆర్ధిక ప్రవీణ్ గౌడ్ పార్టీకి రాజీనామా చేసి, ఎంపీ కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.
ఇబ్రహీపట్నం నియోజకవర్గంలోని ఆధిభట్ల మున్సిపాలిటీ పరిధిలో కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ ను వీడి కొత్త ఆర్ధిక ప్రవీణ్ గౌడ్ టీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి సమక్షంలో ఆమె సొంతపార్టీకి చేరారు.
సీఎం కేసీఆర్ తాను తీసుకున్న గోతిలో తానే పడుతున్నారని, జైలు భయంతోనే కేసీఆర్ బీజేపీ చెప్పినట్లు వింటున్నారని విమర్శించారు. రైతు చట్టాలను వ్యతిరేకించి, ఇప్పుడు మాట మార్చటం అందులో భాగమేనన్నారు. ఎల్.ఆర్.ఎస్ పై సంక్రాంతి లోపు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవాలని, లేదంటే ప్రత్యక్ష కార్యచరణ ప్రకటిస్తామని ఎంపీ కోమటిరెడ్డి హెచ్చరించారు.