ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నేతల అరెస్టు సంచలనంగా మారింది. కిడ్నాప్ కేసు కింద ఆరుగురు బీఆర్ఎస్ నేతలను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై ఫైల్ అయిన ఫిర్యాదు మేరకు పోలీసులు వారిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మూడు వాహనాల్లో వచ్చి ఆరుగురు బీఆర్ఎస్ లీడర్లను రణదీవేనగర్ లో పోలీసులు అరెస్ట్ చేశారు.
డబ్బుల లావాదేవీల్లో ఓ మహారాష్ట్ర వ్యక్తిని కిడ్నాప్ చేసినట్టుగా వీరిపై వార్దా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అంతే కాకుండా వీరు 2 లక్షలు డిమాండ్ చేసినట్టు కూడా నిందితులపై అభియోగం ఉంది. ఈ క్రమంలో నిందితుల నుంచి 25 వేలను పోలీసులు రికవరీ చేశారు.
ఇక అరెస్ట్ అయిన వారిలో బీఆర్ఎస్ ముఖ్యనేత ముఖిత్, కార్యకర్తలు సూర్యకాంత్, షారూఖ్,సంజీవ్, నందకుమార్, విట్టల్ ఉన్నారు. అయితే వీరి మొబైల్ నెంబర్ ఆధారంగా ట్రాక్ చేసిన పోలీసులు.. లొకేషన్ ట్రేస్ చేసి పట్టుకున్నట్టుగా సమాచారం.
మరొక ఆశ్చర్యకరమైన విషయమేమింటంటే.. ఈ ఆరుగురి అరెస్టులపై తెలంగాణ పోలీసులు సైలెంట్ గా ఉండడం. ఈ విషయంలో తమకేమీ తెలియదని ఆదిలాబాద్ జిల్లా పోలీసులు చెబుతుండడం గమనార్హం.