ప్రగతి భవన్ ను అదిలాబాద్ రైతులు ముట్టడించారు. పీఎం ఫసల్ బీమా యోజన పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం కట్టకుండా కాలయాపన చేస్తున్నందుకు ఆదిలాబాద్ రైతులు ఆగ్రహంతో పెద్ద ఎత్తున తరలివచ్చారు.
రైతుల బీమా ఫసల్ యోజనకి గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టకపోవడంతో రైతులకు ఇన్సురెన్స్ రావడంలేదని వారంతా ఆరోపించారు. తమ వాటా చెల్లించడానికి రైతులు సిద్ధంగా ఉన్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా వాటా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడంలేదన్నారు. రైతులంతా పెద్ద ఎత్తున సీఎం కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.