– నిరసన బాటపట్టిన ఆదివాసీలు
– ఉట్నూర్ ఐటీడీఏ ఆఫీస్ ముట్టడి
– రాళ్లదాడి.. చైర్మన్ వాహనం ధ్వంసం
ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతారణం నెలకొంది. తమ రిజర్వేషన్లలో 11 కులాలను కలపడాన్ని వ్యతిరేకిస్తూ ఆదివాసీలు నిరసన చేపట్టారు.
భారీ సంఖ్యలో ఐటీడీఏ వద్దకు చేరుకున్న వారు కార్యాలయంపై రాళ్ల దాడి చేశారు. అనంతరం లోపలికి చొచ్చుకెళ్లి.. చైర్మన్ ఛాంబర్ పై దాడి చేసి, వాహనం ధ్వంసం చేశారు. కార్యాలయంలో ఫర్నీచర్, ఏసీలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు.
ఈ క్రమంలో అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆదివాసీలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అదికాస్తా ఉద్రిక్తంగా మారింది.
ఈ నేపథ్యంలో నిర్మల్ కలెక్టర్ వరుణ రెడ్డి, ఐటీడీఏ పీవో ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ప్రగతిభవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు ఆదివాసీలు.