టాలీవుడ్ స్టార్ల క్రేజ్ ఇండియా మొత్తం విస్తరిస్తోంది. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దేశ రాజధాని ఢిల్లీలోని రావణ దహన కార్యక్రమంలో పాల్గొన్నాడు. విజయదశమిని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం లవ్ కుశ్ రాంలీల మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభాస్ సందడి చేశాడు. ప్రభాస్ ని చూసేందుకు భారీగా జనం ఎగబడ్డారు. రావణ సంహారంలో భాగంగా ప్రభాస్ విల్లుతో బాణాన్ని సంధించారు. రాంలీలా కమిటీ ఆహ్వానం మేరకే రెబల్ స్టార్ ఈ వేడుకకు అటెండ్ అయ్యాడు.
భారత సంస్కృతి పట్ల హీరో ప్రభాస్ కు ఉన్న అంకిత భావం చూసే ఆయన్ని పిలిచామని లవ్ కుశ్ రామ్ లీలీ కమిటీ ప్రెసిడెంట్ అర్జున్ కుమార్ తెలిపారు. కరోనా పరిస్థితుల్లో రెండేళ్లుగా రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించలేదు. అందువల్ల కమిటీ నిర్వాహకులు ఈసారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభాస్ అతిథిగా పాల్గొనడం విశేషం.
ఢిల్లీలోని రామ్ లీలా మైదానంతో విజయ దశమి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారనే సంగతి తెలిసిందే. హీరో ప్రభాస్ ఉత్సవాల్లో భాగంగా రాం లీలా మైదానంలో రావణుడిని దహనం చేయనున్నాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు పలు దేశాల రాయబారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఇక టాలీవుడ్ క్రేజీ హీరో ప్రభాస్, ప్రముఖ డైరెక్టర్ కాంబోలో వస్తోన్న చిత్రం ‘ఆదిపురుష్’. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ జానకిగా, లంకేశ్‌గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఈ సినిమాను రూ.500కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియాగా రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఈ మూవీ టీజర్ మధ్యనే రీలీజ్ అవ్వగా.. మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ టీజర్ అన్ని భాషల్లో కలిపి 100మిలియన్స్‌కి పైగా వ్యూస్ సాధించి సంచలనం సృష్టించింది.
Our Raghava, #Prabhas fired arrows to burn the Ravan Effigy in #RavanDahan, Delhi.#JaiShreeRam #Adipurush pic.twitter.com/FKx6Ldh0hO
— Prasad Bhimanadham (@Prasad_Darling) October 5, 2022