ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆదిపురుష్ టీజర్ విడుదలైంది. టీజర్ లో ప్రభాస్ స్క్రీన్ ప్రజెన్స్, విజువల్స్ అన్ని కూడా హాలీవుడ్ ను తలపించేలా ఉన్నాయి. కానీ ఈ టీజర్ చాలా మంది అభిమానులను తీవ్రంగా నిరాశపరించింది. ప్రభాస్ ను దర్శకుడు యానిమేషన్ లో చూపించారంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కూడా.
అంతేకాకుండా వీఎఫ్‌ఎక్స్, సీజీ కూడా అస్సలు బాలేదని కామెంట్స్ చేస్తున్నారు. రజిని నటించిన ‘విక్రమ సింహా’ సినిమాలాగ ఉందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రం బాలీవుడ్‌లో రికార్డు క్రియేట్ చేసింది.
తాజాగా ఆదిపురుష్ టీజర్ సరికొత్త రికార్డును సృష్టించింది. బాలీవుడ్‌లో ఫాస్టెస్ట్ 50మిలియన్ వ్యూస్ సాధించిన టీజర్‌గా రికార్డు సృష్టించింది. అంతేకాకుండా ఆదిపురుష్ టీజర్‌కు హిందీలో ఇప్పటివరకు 9లక్షల 33వేలకు పైగా లైక్స్ వచ్చాయి.
కేవలం 16 గంటల్లోనే ఆదిపురుష్ రికార్డులను క్రియేట్ చేసిందంటే విశేషం అనే చెప్పాలి. విడుదలకు ముందే ఇలా రికార్డులు క్రియేట్ చేయడంతో చిత్రబృందం సంతోషంగా ఉంది. రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించాడు.
ప్రభాస్‌కు జోడీగా కృతి సనన్ హీరోయిన్‌గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. దాదాపు 500కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది.