యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఈ ఉదయం ఓ విషయం పంచుకుంటానన్న సినిమా యూనిట్.. ఆ వివరాలని వెల్లడించింది. మోషన్ క్యాప్చర్‌తో ఆదిపురుష్ సినిమా మొదలు కానున్నట్టు ప్రకటించింది. సరికొత్త టెక్నాలజీతో సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలిపింది. అంతర్జాతీయ స్థాయిలో సినిమాని చిత్రీకరించేందుకు ఓం అతని టీం పని చేస్తున్నారన్న నిర్మాతలు భూషణ్ కుమార్, కృషన్ కుమార్.. ఆదిపురుష్‌తో ఇండియన్ సినిమా స్థాయి మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఫిబ్రవరి 2 నుంచి షూటింగ్ ప్రారంభం కానుండగా.. 2022 ఆగష్టు 11న సినిమాను విడుదల చేయనున్నట్టు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. రామాయణం ఆధారంగా రూపొందిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి పాత్రలో కనిపించబోతున్నారు. గ్రాఫిక్స్ భారీ రేంజ్‌లో ఖర్చుపెట్టనున్నారని తెలుస్తోంది.
Motion capture begins. Creating the world of #Adipurush #Prabhas #SaifAliKhan #BhushanKumar @vfxwaala @rajeshnair06 @TSeries @retrophiles1 #TSeries pic.twitter.com/qAPlgL2qC9
— Om Raut (@omraut) January 19, 2021