జబర్ధస్త్‌కు పోటీగా… జీ తెలుగులో వస్తున్న కామెడీ షో అదిరింది. జబర్ధస్త్ జడ్జ్ నాగబాబు అదిరింది షోకు అంతా తానే అయి తీసుకువస్తున్నారు. జబర్ధస్త్‌ను ఢీ కొడుతుందా…? అదిరింది అదరగొడుతుందా…? ఇలా అనేక ప్రశ్నలు అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నేపథ్యంలో వచ్చిన అదిరింది ప్రోమో నిజంగానే అదరగొట్టేలా కనపడుతోంది.
మంచు విష్ణు స్కూల్‌పై జీఎస్టీ అధికారుల దాడులు
గత ఏడు సంవత్సరాలుగా… తెలుగులో కామెడీ షో అనగానే గుర్తొచ్చేది జబర్ధస్త్. అడల్డ్ కామెడీ అని కొందరు, బూతు పురాణంకు కామెడీ పేరు తగిలించారని కొందరు ఎన్ని విమర్శలు వచ్చినా జనం మాత్రం ఆదరించారు. అయితే… తాజాగా నాగబాబు షో నుండి ఎగ్జిట్ ఇవ్వటం, జబర్ధస్త్‌లో అంతా వెళ్లిపోతున్నారని ప్రచారం జరగటంతో జబర్ధస్త్ ఫ్యూచర్‌తో పాటు నాగబాబు కొత్త షోపై అనేక సందేహాలు ఏర్పడ్డాయి.
కన్నతల్లి ప్రేమకు దూరమైన కమెడియన్ అలీ
అయితే… అదిరింది షో ఈ ఆదివారం నుండి ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే నాగబాబుపై రిలీజ్ అయిన ప్రోమో సోసో అనిపించినా, మెగా అభిమానులు మాత్రం ఓన్ చేసుకున్నారు. కానీ ప్రోగ్రాం ప్రోమో మాత్రం నిజంగానే అదరగొడుతుంది. జబర్ధస్త్‌కు ఏమాత్రం తగ్గకుండా, హైపర్ ఆది మార్క్ కామెడీ పంచ్‌లతో పాటు సీనీయర్ ఆర్టిస్టులతో అదిరింది షో అదరగొడుతుంది. పైగా ఈవీక్‌లో నాగబాబుతో పాటు గెస్ట్ పోజిషన్‌లో నాగబాబు కూతురు నిహారిక స్పెషల్ అడ్రాక్షన్‌గా నిలిచింది.
అదిరింది ప్రోమో మీరు చూడాలనుకుంటున్నారు… ఇదే ఆ వీడియో.
.