జబర్దస్త్ కామెడీ షోకు పోటీగా వచ్చిన షో “అదిరింది” ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతోంది. ఎపిసోడ్ , ఎపిసోడ్ కి మధ్య వైవిధాన్ని ప్రదర్శిస్తూ హాస్యాన్ని పండిస్తోంది ఈ షో. అయితే ఈ షోకు యాంకర్ గా బుల్లితెర బ్యూటీ సమీరా షెరిఫ్ వ్యవహరిస్తుండగా.. జడ్జీలుగా నాగబాబు, నవదీప్ ఉన్నారు. ఇక టీమ్ లీడర్లుగా ఆర్పీ, ధన్ రాజ్, చంద్ర, వేణు కొనసాగుతున్నారు. కాగా జబర్దస్త్ లో ఈ టీమ్ లీడర్ల పేర్లు చమ్మక్ చంద్ర, ధనాధన్ ధన్‌రాజ్, కిరాక్ ఆర్పీ, వండర్స్ వేణుగా ఉండేవి. వీరు ఆ షోను వదిలేయడంతో మునుపటి పేర్లను కూడా మార్చాలని ‘అదిరింది’ షో యాజమాన్యం భావించింది. దీంతో నిన్నటి ఎపిసోడ్ లో జడ్జీలు నాగబాబు, నవదీప్ లు టీమ్ లీడర్ల పేర్లను మార్చినట్లు ప్రకటించారు. ఇక నుంచి ధన్‌రాజ్ టీమ్‌ను ధన్‌రాజ్ బ్లాస్టర్స్, ఆర్పీ టీమ్‌ను ఆర్పీ రైడర్స్, చంద్ర టీమ్‌ను చంద్ర ఛాలెంజర్స్, వేణు టీమ్‌ను వేణు వారియర్స్‌గా తెలిపారు. నిజానికి వీరంతా మునుపటి పేర్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంతలా అంటే ఆ పేర్లతో వ్యవహరిస్తేనే గుర్తుపెట్టేంతగా క్రేజ్ ను సంపాదించుకున్నారు.