హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితీరావులు డేటింగ్‌లో ఉన్నారంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై ఈ ప్రేమ పక్షులు ఎప్పుడూ స్పందించలేదు. పైగా ఈ జంట చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కెమెరా కంటపడుతూ వార్తల నిజమేనా అని అనిపించేలా చేస్తున్నారు.
వీరిద్దరూ కలిసి గతేడాది తెలుగు సినిమా మహాసముద్రంలో నటించారు. అప్పటి నుంచే వీరి మధ్య ప్రేమ మొదలైనట్టు పుకార్లు వచ్చాయి. ఆ తర్వాత అందాల భామ పుట్టిన రోజు నాడు హీరో సిద్ధార్థ్ పెట్టిన పోస్టు ఒకటి ఈ వార్తలకు బలం చేకూర్చింది.
అదితీ రావుతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ నా హృదయ రాణికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ పోస్టు పెట్టడంతో ఇక వారిది కన్ఫార్మ్ గా ప్రేమే అని అందరూ ఫిక్స్ అయ్యారు. ఆ తర్వాత ఈ జంట చాలా సార్లు బయట చక్కర్లు కొడుతూ కెమెరా కంట పడింది.
తాజాగా ఈ జంట ముంబై వీధుల్లో చెక్కర్లు కొట్టింది. అదితీ రావు తన బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ తో ముంబైలోని ఓ రెస్టారెంట్ లో కనిపించింది. అక్కడ లంచ్ చేసిన అనంతరం వారిద్దరూ ఒకే కారులో వెళ్లిపోయారు. ఈ సమయంలో వారు కెమెరా కంట పడ్డారు. దీనికి సంబంధించిన ఫోటోలు తాజాగా వైరల్ అవుతున్నాయి.