ముంబైని ఒంటిచేత్తో మేనేజ్ చేసే కుటుంబం వారిది. అక్కడ ఎవరు ఏం చేయాలన్నా వారి పర్మిషన్ కావాలి. ప్రజలతోనూ మాట్లాడతారు.. మాఫియాతోను మాట్లాడతారు.. అండర్ వరల్డ్ మాఫియాకు.. వీరికి మధ్యలో క్లాష్ లేకుండా చూసుకుంటారంతే.. వీరు కూడా మాఫియాలాంటి వారే. కాని తమను నమ్ముకున్న జనానికి సాయం చేయడమనే లక్షణమొక్కడే వారిని ప్రజల్లో నిలబెట్టింది. ఆ సంప్రదాయాన్ని ప్రారంభించిన థాక్రే ఇప్పుడు లేరు. ఆయన కొడుకు ఉద్దవ్ థాక్రే ఇప్పుడు దాన్ని కొనసాగిస్తున్నారు. కాని థాక్రే మనవడు.. ఉద్ధవ్ కొడుకు అయిన ఆదిత్య థాక్రే మాత్రం ఇప్పుడు వివాదంలో కూరుకుపోయారు. బాలీవుడ్ తో పెనవేసుకుపోయిన ఆయన అనుబందమే ఇప్పుడు ముద్దాయిలా నిలబెట్టేసింది. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణ వివాదం.. ఇప్పుడు ఆదిత్యను చుట్టుముట్టేస్తోంది.
అసలే థాక్రే మనవడు.. ఇప్పుడు సీఎం కొడుకు.. పైగా స్వయంగా మినిస్టర్.. అసలు సీఎం కావాల్సినవాడు.. శరద్ పవార్ నో చెప్పడంతో ఉద్ధవ్ సీఎం అయ్యాడు.. లేదంటే ఈ 30 ఏళ్ల ఆదిత్య సీఎం అయిపోయే వాడు.
అందుకే ఇప్పుడు ఉద్దవ్ సీఎం అయినా.. కింది స్థాయిలో పవర్ అంతా మనోడిదే. పవర్ ఉంటే.. చుట్టూ చేరిపోతారు కదా.. అప్పటికే బాలీవుడ్ పార్టీలకు వెళ్లే ఆదిత్యకు.. బాలీవుడ్ సెలెబ్రిటీలంతా ఫ్రెండ్స్ అయిపోయారు. హీరోయిన్ దిశాపటానీతో తిరుగుతున్నారని కొన్నాళ్లు వార్తలు, వారి ఫోటోలు హల్ చల్ చేశాయి. ఎక్కడ ఏ ఓపెనింగ్ జరిగినా.. ఏదో ఒక హీరోయిన్ తో సార్ ఫోటో లేకుండా జరగలేదు ఆ ప్రోగ్రామ్. అంతలా బాస్ డీప్ గా బాలీవుడ్ లోకి వెళ్లిపోయాడు. ఇప్పుడు సుశాంత్ కేసులో ఆదిత్య పేరు ఎందుకొచ్చింది? ఎందుకంటే.. సుశాంత్ చనిపోయిన రోజు రాత్రికి ముందు జరిగిన పార్టీకి ఆదిత్య కూడా అటెండ్ అయ్యాడనేది ఆరోపణ. సుశాంత్ కేసులో పోరాడుతున్న కంగనా రనౌత్ అయితే.. ఫిబ్రవరిలోనే సుశాంత్ కు ప్రాణభయం ఉందని కేసు పెడితే.. సుశాంత్ ది ఆత్మహత్య అని పోలీసులు గంటల్లనే ఎలా ఫైనల్ చేశారని నిలదీస్తోంది. పైగా బిజెపి ఎంపీ సుబ్రమణ్య స్వామి అయితే.. ఆదిత్య సుశాంత్ ఇంటికి పార్టీకి వచ్చాడనే చెబుతున్నారు.. పైగా ఇది ఆత్మహత్య కాదని.. హత్య అని ఆరోపించారు.
కొందరు డాక్టర్లు అయితే.. ఆత్మహత్య అయితే ఫీచర్స్ ఎలా ఉంటాయో చెప్పి.. అవి లేవని సోషల్ మీడియాలో డీటెయిల్డ్ గా ఇస్తున్నారు. పైగా సుశాంత్ మరాఠీ కాదు.. బీహారీ.. పైగా బుల్లితెర నుంచి కష్టపడి పైకొచ్చినవాడు.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేనివాడు. సినిమాలు హిట్ అయిన తర్వాత.. పైప్ లైన్ లో కొత్త ప్రాజెక్టులుండగా సుశాంత్ డిప్రెషన్ లోకి ఎందుకెళ్లాడనేదే ప్రశ్న. అందుకు కొందరు చెబుతున్న సమాధానం ఏంటంటే.. సుశాంత్ ను బాలీవుడ్ ను ఏలుతున్న మాఫియా బెదిరించిందని.. వారికి ఆదిత్య సపోర్ట్ ఉందని. సుశాంత్ తో సినిమాలు తీయడానికి ముందుకొచ్చే నిర్మాతలను వెనక్కి పంపించారనేది ఆరోపణ. వీటన్నిటిలోనూ ఆదిత్య ఇన్ వాల్వ్ అయ్యాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ నిజాలే అయితే.. ఇప్పుడు సీబీఐ విచారణ జరగబోతుంది కాబట్టి.. మహారాష్ట్ర గవర్నమెంటుకు గడ్డుకాలం మొదలైనట్లే.. అసలే శివసేన, బిజెపిల మధ్య వైరం పెరిగిపోయింది. ఏ అవకాశం దొరికినా వదిలిపెట్టని బిజెపి.. ఇప్పుడు సుశాంత్ కేసును ఆయుధంగా చేసుకుని.. ఆదిత్య ఇన్ వాల్వ్ మెంట్ నిజంగానే ఉందని తేలితే.. ఇక థాక్రే గవర్నమెంట్ ట్రబుల్ లో పడినట్లే.