ఈ రోజుల్లో యువ హీరోలు ఏ అవకాశం వచ్చినా సరే వదులుకునే పరిస్థితి కనపడటం లేదు. సంపాదించుకునే ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదనే చెప్పాలి. సినిమాలు, ప్రకటనలు, ఇతర కార్యక్రమాలు ఇలా అన్ని అవకాశాలను చాలా చక్కగా వినియోగించుకుంటున్నారు. సొంత వ్యాపారాల మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. హీరో పాత్రలే కాదు ఏ పాత్రలు అయినా చేస్తున్నారు.
అందులో అడవి శేష్ ముందు వరుసలో ఉంటాడు అనే చెప్పాలి. వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న ఈ హీరో రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచాడు అని తెలుస్తుంది. తర్వాతి ప్రాజెక్ట్ లతో మరింత దూకుడుగా ఉంటున్నాడు. మల్టీ స్టారర్ సినిమాల మీద కూడా ఫోకస్ చేస్తున్నాడు. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో కూడా పెట్టుబడులు పెడుతున్నాడు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసాడు.
ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసీడర్ గా వ్యవహరించనున్నాడు. మూడేళ్ళ పాటు ఆ సంస్థతో కలిసి ముందుకు వెళ్ళే విధంగా ఆరు కోట్లతో ఒప్పందం చేసుకున్నాడు అని సమాచారం. అలాగే వాళ్ళు నిర్మించే ఒక గేటెడ్ కమ్యూనిటిలో ఫ్లాట్ కూడా ఇస్తున్నారు అని తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒప్పందం కూడా జరిగిందని సమాచారం. ఏది ఎలా ఉన్నా హిట్ 2 సినిమా తర్వాత అడవి శేష్ దశ తిరిగింది అనే చెప్పాలి.