పాన్ ఇండియా సినిమాల గురించి తెలుసు. మరి ఆలిండియా సినిమాల గురించి తెలుసా? మేజర్ సినిమాను ఆల్ ఇండియా సినిమా అంటున్నాడు అడివి శేష్.
“మేజర్ సందీప్ ఆల్ ఇండియా మనిషి. నేను కూడా ఆ స్థాయికి చేరుకునేలా ఉంది ఈ సినిమా. అందుకే ఇది పాన్ ఇండియా కాదు. ఆల్ ఇండియా సినిమా. ఆయన బెంగుళూరు, హైదరాబాద్, కశ్మీర్ ఇలా అన్ని ప్రాంతాలకు వెళ్లారు. అందుకే ఈ సినిమాను అన్ని ఏరియాలకు తీసుకెళ్ళాలనే తపన ఉంది.”
ఇలా మేజర్ సినిమాకు ఆల్ ఇండియా గుర్తింపు ఇచ్చాడు అడివి శేష్. మేజర్ సందీప్ పాత్ర తన కెరీర్ కు సన్ షైన్ లాంటిది అంటున్నాడు ఈ హీరో.
“నాకు మేజర్ సందీప్ పాత్ర సన్‌షైన్ లాంటిది. ఆయన సూర్యపుత్రుడు. తాజ్‌లో సంఘటన జరిగినప్పుడు సందీప్
లోపలికి రాగానే సూర్యపుత్రుడు వచ్చిన ఫీలింగ్ కలిగింది అని ఆయన కాపాడిన ఒకరు చెప్పారు. మిలట్రీ అంటే
సీరియస్ గా వుంటారు అనుకుంటాం. కానీ ఆయన చాలా సరదాగా ఉంటారు.”
ఇలా మేజర్ పై అంచనాలు పెంచేలా మాట్లాడాడు శేశ్. వచ్చేనెల 3వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. దీని కోసం ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లను గణనీయంగా తగ్గించారు.