మేజర్ సినిమా తర్వాత అడివి శేష్ హీరోగా నటించిన మూవీ హిట్ 2. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ సినిమా ఇపుడు మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడం విశేషం.
సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కలెక్షన్స్‌తో దుమ్ము లేపుతోంది. అడివి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఇటీవలే మేజర్ సినిమాతో బంపర్ హిట్ అందుకున్నారు. కెరీర్ మొదట్లో కాస్త తడబడ్డ.. ఆ తర్వాత తనను తాను మార్చుకుని.. స్వయంగా తన సినిమాలను తానే కథలు రాసుకుంటూ వరుసగా హిట్‌లను అందుకుంటున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళీ భాషల్లో విడుదలై మంచి లాభాలను తెచ్చింది.
రీసెంట్‌గా నందమూరి నట సింహా బాలకృష్ణ కూడా హిట్ 2 సినిమా చూసి చిత్ర హీరో అడివి శేష్‌తో పాటు నానిని అభినందించిన విషయం తెలిసిందే కదా. బాలయ్య టాక్‌తో ఈ సినిమాకు మరింత ఊపు వచ్చిందనే చెప్పాలిమొదటి ‘హిట్’ సినిమా కేస్ 1లో విశ్వక్ సేన్ నటించగా.. సీక్వెల్‌లో శేష్ నటించాడు. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం డీసెంట్ టాక్‌తో దూసుకుపోతుంది.
హిట్ 2 థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే.. తెలంగాణ (నైజాం)లో – రూ. 4.00 కోట్లు.. రాయలసీమ (సీడెడ్) – రూ. 1.75 కోట్లు.. ఆంధ్ర – రూ. 4.50 కోట్లు తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి – రూ. 10.25 కోట్లు కర్ణాటక + రెస్టాఫ్ భారత్ – రూ. 1.50 కోట్లు ఓవర్సీస్ – రూ. 2.50 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే.. రూ. 14.25 కోట్లు బిజినెస్ చేసింది. ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే రూ. 15 కోట్లు రాబట్టాలి. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. అడివి శేష్ కెరీర్‌లో ఇదే హైయ్యెస్ట్ థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాగా రికార్డులకు ఎక్కింది.