టాలీవుడ్ లో ఉన్న యంగ్ అండ్ టాలెంటెడ్ నటులలో అడవిశేషు ఒకరు. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఆ తర్వాత క్షణం, గూడచారి, ఎవరు వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలను తీశాడు. ప్రస్తుతం మేజర్, హిట్ 2 వంటి చిత్రాలలో నటిస్తున్నాడు. ఇందులో మేజర్ జూన్ 3న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు జి ఎం బి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఏ ప్లస్ మూవీస్ అండ్ సోనీ పిక్చర్స్ ఫిలిమ్స్ ఇండియా వారితో సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ లో రాజమౌళి చేసిన చిన్న తప్పు…. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్
ముంబై ఉగ్రదాడుల్లో మృతి చెందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ఈ సినిమా ట్రైలర్ కు మంచి ఆదరణ లభిస్తోంది. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు అడవి శేషు.
ఈ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చందమామ సినిమాలో ఒరిజినల్ హీరో నేనేనని… నవదీప్ పాత్రలో నేను చేయాల్సి ఉందని రెండు రోజుల తర్వాత ఆ మూవీ షూటింగ్ క్యాన్సిల్ అయ్యిందని చెప్పుకొచ్చాడు.
కొరటాల శివ సినిమా హీరోలలో ఫాలో అవుతున్న ఒకే సెంటిమెంట్ ఇది గమనించారా ?
ఇక అప్పట్లో చందమామ సినిమా మంచి హిట్ సాధించిన సంగతి తెలిసిందే. నవదీప్, కాజల్ అగర్వాల్, శివబాలాజీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాకు కృష్ణవంశీ దర్శకత్వం వహించారు.