శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరో గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం హిట్. ఈ సినిమాకు న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించారు. కాగా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ కూడా లభించింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని హిట్ సినిమా చివర్లో చెప్పకనే చెప్పారు.
ఇదిలా ఉండగా సీక్వెల్ లో మొదట అడవి శేషు నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం విశ్వక్ సేన్ తో పాటు అడవి శేషు కూడా నటించబోతున్నాడట. ఇప్పటికే దర్శకుడు సీక్వెల్ కథను సిద్ధం చేసి అడవిశేషుకు వినిపించాడని తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరి మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే అధికారికంగా ఎవరో ఒకరు స్పందించాల్సిందే. ప్రస్తుతం అడవి శేషు మహేష్ బాబు నిర్మాణంలో మేజర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.