అడవి శేషు ప్రస్తుతం మేజర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు శివాని రాజశేఖర్ తో కలిసి కూడా 2 స్టేట్స్ సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈసినిమా ప్రస్తుతం వివాదంలో చిక్కుకుంది. బాలీవుడ్ లో మంచి విజయం సాధించిన టూ స్టేట్స్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా మొదలుపెట్టారు.
అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి కాలం అయినప్పటికీ ముందుకు సాగడం లేదు. ఇక ఈ సినిమా ప్రాజెక్టు నుంచి అడవి శేషు తప్పుకున్నాడని ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. శేషు కు సంబంధించిన క్యారెక్టర్ ను సరిగా డిజైన్ చేయకపోవడమే అందుకు కారణం అని కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ సినిమాకు గాను అడవిశేషు అడ్వాన్స్ కూడా తీసుకున్నాడట. ఈ విషయంలోనే నిర్మాత ఎమ్ ఎల్ వి సత్యనారాయణ కోర్టుకెక్కనున్న ట్లు తెలుస్తోంది. అడవి శేషు కి కూడా సినిమాపై ఆసక్తి లేకపోవడంతో లీగల్ గానే వెళ్లాలని శేషు కూడా భావిస్తున్నాడట.