డెంగ్యూ బారిన పడి ఆసుపత్రిలో చేరిన సినీ నటుడు అడివి శేషు కోలుకున్నారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి మాములుగానే ఉన్నా… కొన్ని రోజులు రెస్ట్ అవసరమని డాక్టర్లు సూచించినట్లు తెలుస్తోంది. అడివి శేషు సెప్టెంబర్ 18న ఆసుపత్రిలో చేరారు.
తను ఇంటికి చేరానని, కోలుకుంటున్నట్లు తన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా వెల్లండిచిన శేషు… నేను కోలుకోవాలని ప్రార్థించి నాకు ధైర్యాన్నిచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని తెలిపారు.
శేషు ప్రస్తుతం మేజర్ సినిమాలో నటిస్తుండగా, త్వరలో హీరో నాని నిర్మించబోయే హిట్-2 సినిమాలో నటించబోతున్నాడు. వీటితో పాటు గూడాచారి-2 కూడా పట్టాలెక్కించబోతున్నట్లు ఫిలింనగర్ టాక్.