ఓ ఇంట్లో అక్రమంగా దాచి పెట్టిన వంద కోట్ల రూపాయలు విలువ చేసే పురాతన వస్తువులను సీజ్ చేశారు అధికారులు. బెంగాల్ లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఓ వ్యక్తి ఏకంగా 15 వేల పురాతన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. దేగంగా ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్ ద్వారా అడ్మినిస్ట్రేటర్ జనరల్ అండ్ వెల్ఫేర్ ట్రస్టీ అధికారులు ఈ దాడులు జరిపారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రకేతుగర్ కు చెందిన అసద్ ఉల్ జమాన్ అనే వ్యక్తి నివాసంలో శుక్రవారం అధికారులు దాడులు జరిపారు. ముందుగా అధికారులు కస్టమర్ల రూపంలో అసద్ ఉల్ జమాన్ ఇంటికి వెళ్లారు. అతని నుంచి అన్ని వివరాలు సేకరించిన తర్వాత వస్తువులను సీజ్ చేశారు.
ఈ వస్తువులు ప్రాచీన భారతేదశానికి చెందిన మౌర్య , కనిష్క సామ్రాజ్యం కాలానికి చెదినవిగా గుర్తించారు. ఈ వస్తువులను మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచనున్నట్లు వెల్లడించారు.
అలాగే అసద్ వద్ద 15 వేలకు పైగా పురాతన వస్తువులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీటిలో 15, 20 మాత్రమే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ధ్రువీకరించిన వస్తువులన్నారు. సర్టిఫికేట్ లేని వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అధికారులు.