ఓ గాయకుడు సరదాగా ఎంజాయ్ చేస్తున్నతన ట్రిప్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో ఉంచారు. వాటిని చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు..ఎందుకంటే ఆ ఫొటోలలో ఆయన గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉన్నారంటూ అభిమానులు తెలుపుతున్నారు. ఇంతకీ ఆ గాయకుడు ఎవరంటే….?
ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ..
ఆద్నాన్ తన కుటుంబంతో కలిసి మాల్దీవులకు వెళ్లారు. అక్కడ ఆయన దిగిన కొన్ని చిత్రాలను ఇన్‌స్టాలో ఉంచుతూ “జస్ట్ చిల్లింగ్” అని రాసుకొచ్చారు. వాటిని చూసిన అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనైయ్యారు. స్విమ్మింగ్‌పూల్ లో తన కూతురుతో కలిసి ఉన్న ఒక చిత్రాన్నిఅద్నాన్ తన ఇన్‌స్టాలో ఉంచారు.
కొందరు అభిమానులు ఆయన చిత్రాలను చూసి మీలో ఈ మార్పులను మేము నమ్మలేకపోతున్నాం అంటూ రాసుకోచ్చారు. తన పిల్లలతో కలిసి జపనీస్ వంటకాలను ఆస్వాదిస్తున్న అద్నాన్ మరో చిత్రాన్ని పంచుకున్నారు. “ప్రసిద్ధ మార్-ఉమి రెస్టారెంట్‌లో భోజనం. అద్భుతమైన పెరువియన్ , జపనీస్ వంటకాలు!! జస్ట్ వావ్!!. అంటూ కొన్నిచిత్రాలను ఆద్నాన్ పంచుకోవడంతో వీటిపై ఒక అభిమాని స్పందిస్తూ….. “హాట్‌గా కనిపిస్తున్నారు” అని అన్నారు.
Advertisements
ఆయన బరువు తగ్గిన తరువాత ప్రతిరోజు ఏదో ఒక ఫొటోను ఆయన తన అభిమానులతో పంచుకుంటున్నారు.