తెలుగుదేశం పార్టీ తలపెట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఆందోళనలో పాల్గొనడానికి వెళ్ళిన టీడీపీ నేత అప్పలనాయుడును ఉండవల్లిలోని చంద్రబాబు నివాస సమీపంలో అరెస్టు చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అదే సమయంలో ఆయనతో పాటు మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, నన్నపనేని రాజకుమారిని కూడా అరెస్టు చేశారు. భూమా అఖిలప్రియను కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత తలెత్తింది.
తెలుగుదేశం నేతల ‘ఛలో ఆత్మకూరు’ ఆందోళనలో కెమెరాకు చిక్కిన చిత్రాలు
![]()
![]()
![]()
![]()
![]()
![]()