నందమూరి బాలకృష్ణ హీరోగా కెఎస్ రవి కుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా రూలర్. ఒకవైపు పోలీస్ ఆఫీసర్ గా మరోవైపు బిజినెస్ మ్యాన్ గా బాలయ్య ఇందులో కనిపించనున్నాడు. ఇప్పటికే టీజర్ తో, మాస్ డైలాగ్స్ తో అలరించిన బాలయ్య వీడియో గ్లింప్స్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
అదిగదిగో యాక్షన్ హీరో అంటూ వచ్చిన బాలయ్య బిజినెస్ మ్యాన్ గా పబ్ లో అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నాడు. టీజర్ తో పాటు సరికొత్త లుక్స్ తో ఇప్పటికే సినిమాపై అంచనాలను పెంచిన బాలయ్య ఇప్పుడు ఆ అంచనాలను మరింత పెంచేశాడు. డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో సోనాక్షి చౌహన్, వేదికలు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. భూమిక, ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాను సీకే ఎంటర్‌టైన్మెంట్ బేనర్ పై సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు.